ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Child Trafficking: సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా.. నిందితుల్లో నర్సులు, వ్యాపారులు..

ABN, Publish Date - May 28 , 2025 | 09:10 PM

Child Trafficking: ఆ ముఠా పిల్లలు లేని వారిని గుర్తించి.. 10 వేల నుండి 2 లక్షల కమీషన్‌తో విక్రయాలు సాగించింది. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించింది.

Child Trafficking

సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి చెర నుంచి 10 మంది చిన్నారులను క్షేమంగా బయటకు తెచ్చారు. వారిలో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. చిన్నారులందరినీ నల్గొండ బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. మొత్తం 28 మంది శిశువులను ఆ గ్యాంగ్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న దంపతులు శిశు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.


పిల్లలు లేని వారిని గుర్తించి.. 10 వేల నుండి 2 లక్షల కమీషన్‌తో విక్రయాలు సాగించారు. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించారు. ఈ ముఠా మహారాష్ట్ర, గుజరాత్‌ల నుండి శిశువులను తెచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల్లో పలువురు నర్సులు, వ్యాపారులు కూడా ఉన్నారు.

ముంబై, జనగాం, ఏలూరు, మునగాల పీఎస్‌లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఘటనపై ఎస్పీ కే నర్సింహ మాట్లాడుతూ.. ‘ శిశు విక్రయాలు చేసిన తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తాం. మిగిలిన చిన్నారులను కూడా క్షేమంగా బయటకు తెస్తాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్

ఇద్దరిదీ ప్రేమ వివాహం.. భార్యను అత్యంత దారుణంగా..

Updated Date - May 28 , 2025 | 09:19 PM