Chicken: కోడి.. తిందామా.. వద్దా..
ABN, Publish Date - Feb 15 , 2025 | 11:11 AM
చికెన్ గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 15 రోజుల నుంచి కస్టమర్లు తగ్గడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ(Bird flu) వ్యాధిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో వినియోగదారులు చికెన్ కొనడం తగ్గించారు.
బర్డ్‌ఫ్లూ భయంతో ఆలోచిస్తున్న చికెన్ ప్రియులు
గిరాకీలు లేక వెలవెలబోతున్న దుకాణాలు
హైదరాబాద్: చికెన్ గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 15 రోజుల నుంచి కస్టమర్లు తగ్గడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ(Bird flu) వ్యాధిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో వినియోగదారులు చికెన్ కొనడం తగ్గించారు. దీంతో యజమానులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. శేరిలింగంపల్లి(Sherilingampally) నియోజకవర్గంలో రోజువారీగా వందల కిలోల చికెన్ అమ్ముడుపోయేది. ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా వినియోగం లేకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బర్డ్‌ఫ్లూ కోళ్లకు తాకిందా లేదా అనే విషయం నిర్ధారణ లేదు. కానీ వివిధ మాంధ్యమాలలో వస్తున్న వదంతులతో చికెన్ వాడకం తగ్గింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బాలికను వ్యభిచారంలో దించిన నలుగురికి జైలుశిక్ష
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News
Updated Date - Feb 15 , 2025 | 01:36 PM