Share News

Hyderabad: బాలికను వ్యభిచారంలో దించిన నలుగురికి జైలుశిక్ష

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:42 AM

ఓ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడడమే గాకుండా వ్యభిచార కూపంలోకి దింపిన నిందితులకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు యావజ్జీవశిక్ష, జరిమానా విధించింది.

Hyderabad: బాలికను వ్యభిచారంలో దించిన నలుగురికి జైలుశిక్ష

హైదరాబాద్‌ సిటీ: ఓ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడడమే గాకుండా వ్యభిచార కూపంలోకి దింపిన నిందితులకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు యావజ్జీవశిక్ష, జరిమానా విధించింది. చైతన్యపురి పోలీస్‏స్టేషన్‌(Chaitanyapuri Police Station) పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ సంరక్షణలో ఉంటున్న ఓ బాలికతో పరిచయం పెంచుకొని యార్లగడ్డ చంటి లొంగదీసుకున్నాడు. బాలికపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు వ్యభిచార కూపంలోకి దించాడు. ఇందులో యార్లగడ్డ పుష్ప, కేతావత్‌ కృష్ణవేణి, గోదా మల్లేశ్వరిలను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు దోషులుగా నిర్థారించింది.

ఈ వార్తను కూడా చదవండి: Indira Park: బోసిపోయిన ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే..


యార్లగడ్డ చంటికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1.30లక్షల జరిమానా, యార్లగడ్డ పుష్పకు 10సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.30వేల జరిమానా, కేతావత్‌ కృష్ణవేణి(Ketavat Krishnaveni), గోదా మల్లేశ్వరిలకు ఒక్కొక్కరికీ 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25లక్షల జరిమానా విధించారు. బాలికకు రూ.15లక్షలు, నిందితుల మూలంగా లైంగిక వేధింపులకు గురైన మరో బాధితురాలికి రూ.5లక్షలు అందించారు. న్యాయమూర్తి ఎంకె. పద్మావతి తీర్పు వెల్లడించగా, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సునీత, రఘు వాదనలు వినిపించారు.


ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 10:42 AM