Gachibowli: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:32 AM
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది.
రాయదుర్గం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. కామారెడ్డికి చెందిన సురేశ్ రెడ్డి(28) మణికొండలో సోదరుడితో ఉంటూ స్థానికంగా ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 16న సోదరి ఇంటికి వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. బుధవారం కొండాపూర్ రాజరాజేశ్వర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు.
గదిలోకి హీలియం గ్యాస్ సిలెండర్‌ను తీసుకువెళ్లి ముఖానికి కవర్ కట్టుకుని హీలియం గ్యాస్ పీల్చి ఆత్యహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిఉంది.
Updated Date - Jun 19 , 2025 | 03:32 AM