సమాచారశాఖ స్పెషల్ కమిషనర్‌గా ప్రియాంక
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:49 AM
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన హరీశ్ తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీపై వెళ్లారు.
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన హరీశ్ తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీపై వెళ్లారు. దీంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరించిన ప్రియాంక ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీతో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ప్రియాంకకు సమాచార శాఖ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అలాగే జెన్కో ఎండీగా వెళ్లిన హరీశ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ప్రియాంక సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Updated Date - Jun 17 , 2025 | 04:49 AM