ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medicine Price Reduction: 37 ఔషధాల ధరల తగ్గింపు

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:26 AM

పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం ఊరట కల్పించింది. 37 నిత్యావసర ఔషధాల ధరలను తగ్గించింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) సీలింగ్‌ ధరలను జారీ చేసింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం ఊరట కల్పించింది. 37 నిత్యావసర ఔషధాల ధరలను తగ్గించింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) సీలింగ్‌ ధరలను జారీ చేసింది. వీటిలో ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, వాపుల నుంచి మధుమేహం, విటమిన్‌ లోపాల వరకు ఉపయోగించే మందులు ఉన్నాయి. వీటిలో పారాసిటమాల్‌, అటోర్వాస్టాటిన్‌, అమోక్సిసిలిన్‌, మెట్‌ఫార్మిన్‌ వంటి ఔషధాలున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌ విక్రయించే ఎసిలోఫెనాక్‌, పారాసిమాల్‌, ట్రెప్సిన్‌ కైమోట్రిప్సిన్‌ కాంబినేషన్‌ టాబ్లెట్‌ ధర రూ.13గా నిర్ణయించారు. ఇదే కాంబినేషన్‌తో క్యాడిలా ఫార్మాసూటికల్స్‌ విక్రయించే టాబ్లెట్‌ ధరను రూ.15.01గా ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధులున్న వారు వాడే అటోర్వాస్టాటిన్‌ 40 ఎంజీ+క్లోపిడొగ్రెల్‌ 75 ఎంజీ టాబ్లెట్‌ ధరను రూ.25.61గా నిర్ణయించారు. విటమిన్‌ డీ లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్‌ చుక్కల మందు, చిన్నారులకు వాడే సెఫిక్సిమ్‌ ఓరల్‌ సస్పెన్షన్‌, డైక్లోఫెనాక్‌ ఇంజెక్షన్‌ (ఒక ఎంఎల్‌ రూ.31.77) వంటివి కూడా ధరలు తగ్గించిన వాటిలో ఉన్నాయి. టైప్‌ 2 డయాబెటీస్‌ నియంత్రణలో కీలకమైన ఎంపాగ్లిప్లోజిన్‌, సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కాంబినేషన్స్‌ ఒక్కో టాబ్లెట్‌ ధరను రూ.16.50కి పరిమితం చేశారు.

Updated Date - Aug 04 , 2025 | 04:26 AM