High Court: ధర్నా చేసిన పోలీసు అభ్యర్థులపై కేసు కొట్టివేత
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:36 AM
గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన పోలీసు ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ధర్నాచేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టులో..
ధర్నా చేసిన పోలీసు అభ్యర్థులపై కేసు కొట్టివేత
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన పోలీసు ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ధర్నాచేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ధర్నాలో పాల్గొన్న ఎనిమిది మంది నిరుద్యోగులపై పెట్టిన కేసును కొట్టివేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పిటిషనర్‌లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
అప్పుల వసూలు పోలీసుల బాధ్యత కాదు:హైకోర్టు
అప్పులు వసూలు చేసి పెట్టే బాధ్యత పోలీసులది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికి సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణాలు వసూలు చేసిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగినా లాభం లేదని తెలిపింది. అప్పుతీసుకున్నవాడు మోసం చేశాడని, అతనిపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని పేర్కొంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం.. అప్పులు వసూలు చేసే అధికారం పోలీసులకు లేదని పేర్కొంది. దీంతో పిటిషనర్ కేసును ఉపసంహరించుకున్నారు.
Updated Date - Jul 09 , 2025 | 06:36 AM