ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

ABN, Publish Date - May 21 , 2025 | 06:52 AM

దేశసేవలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సంపంగి నాగరాజు కశ్మీర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి భౌతికకాయాన్ని స్వగ్రామమైన నర్సంపేటకు తరలించగా, కుటుంబంలో విషాదం అలముకుంది.

కశ్మీర్‌లో నర్సంపేటకు చెందిన బీఎస్ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

స్వగ్రామానికి భౌతికకాయం

నర్సంపేట, మే 20 (ఆంధ్రజ్యోతి): దేశ సేవ కోసం సరిహద్దు భద్రతా దళం (బీ ఎ్‌సఎ్‌ఫ)లో చేరిన యువకుడు.. విగతజీవిగా ఇంటికి చేరాడు. కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో జవాన్‌గా పనిచేస్తున్న అతను సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన బీఎ్‌సఎఫ్‌ జవాన్‌ సంపంగి నాగరాజు (28) 2016లో బీఎ్‌సఎ్‌ఫలో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం అధికారులు నాగరాజు భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో నర్సంపేట పాకాల రోడ్డులోని ఆయన నివాసానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగరాజు భౌతికకాయాన్ని చూసి అతని భార్య, తల్లిదండ్రులు మల్లయ్య, విజయ గుండెలవిసేలా రోదించారు. మల్లయ్య, విజయ దంపతుల ముగ్గురు కుమారుల్లో నాగరాజు చిన్నవాడు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడితే ఆర్మీ అధికారులు వెంటనే సమాచారం ఇవ్వకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 21 , 2025 | 06:53 AM