BRS :మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై పోస్టులు
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:13 AM
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో శనివారం బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను విచారించారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మేగీపై సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై కాంగ్రెస్ నేత మహ్మద్ ఫహీమ్ ఖురేషీ ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ జరిగింది.
బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్‌ను విచారించిన పోలీసులు
రాజేంద్రనగర్, జూన్7(ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా శనివారం రాజేంద్రనగర్ పోలీసులు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను విచారించారు. ఆయనను పోలీసు స్టేషన్‌కు పిలిపించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబెట్టారు. ఆయనపై తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) వైస్ ఛైర్మన్ మహ్మద్ ఫహీమ్ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో ఇద్దరు రిపోర్టర్లను విచారించిన పోలీసులు తాజాగా క్రిశాంక్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. విచారణ అనంతరం క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. మిస్‌ఇంగ్లండ్ సొంత దేశానికి వెళ్లి పోటీల నిర్వహణపై ఆరోపణలు చేశారని చెప్పారు. అందుకు సంబంధించిన న్యూస్‌పేపర్ కటింగ్‌లను తాను పోస్టు చేశానని తెలిపారు. దీనికే తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడం బాధాకరమని అన్నారు. దేశానికి వచ్చిన అతిధులకు జరిగిన అవమానాన్ని ఆమె మీడియా ముఖంగా వెల్లడించగా, ఆ కటింగ్స్‌ను సోషల్ మీడియాలో పెట్టినవారిపై ప్రభుత్వం విచారణ చే యిస్తోందని తెలిపారు. అదేవిధంగా మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 05:13 AM