BRS: మంత్రిపై అసభ్య పోస్టు .. బీఆర్‌ఎస్ నేత అరెస్ట్
ABN, Publish Date - May 30 , 2025 | 04:03 AM
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబుపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కాటారం బీఆర్‌ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాటారం, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబుపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కాటారం బీఆర్‌ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఉన్న శ్రావణ్‌ను గురువారం తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు శ్రావణ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
Updated Date - May 30 , 2025 | 04:03 AM