BRS: బీఆర్‌ఎస్ సభకు 3వేల బస్సులు
ABN, Publish Date - Apr 08 , 2025 | 04:08 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో చేపట్టనున్న భారీ బహిరంగసభ కోసం ఆ పార్టీ చర్యలు ముమ్మరం చేసింది.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రూ.8 కోట్ల చెక్కు అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో చేపట్టనున్న భారీ బహిరంగసభ కోసం ఆ పార్టీ చర్యలు ముమ్మరం చేసింది. సభకు జనాన్ని తరలించేందుకు 3వేల ఆర్టీసీ బస్సులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ తదితరులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. బస్సుల అద్దెలో భాగంగా రూ.8 కోట్ల చెక్కును కూడా అందజేశారు.
Updated Date - Apr 08 , 2025 | 04:08 AM