ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:27 AM

లంచం తీసుకుంటూ పలువురు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌లో..

  • బిల్లుల క్లియరెన్స్‌కు లంచాలు తీసుకుంటుండగా పట్టివేత

  • కాప్రా, కరీంనగర్‌లో ఘటనలు

కాప్రా/ కరీంనగర్‌ క్రైం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ పలువురు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌లో కాంట్రాక్టర్‌ సీహెచ్‌.రాంరెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి తనకు రావాల్సిన రూ.2.50 లక్షల పెండింగ్‌ బిల్లు కోసం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ స్వరూప రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ బతిమాలగా రూ.1.20 లక్షలకు ఓకే చెప్పారు. అనంతరం రాంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్‌ నుంచి ఆ నగదు తీసుకుంటున్న ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరోఘటనలో, కరీంనగర్‌కు చెందిన రాజు పంచాయతీరాజ్‌ శాఖలో కొన్నేళ్లుగా తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు రూ.30 వేల చొప్పున ఆరు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఆ బిల్లు క్లియరెన్స్‌ కోసం రూ.8 వేలు ఇవ్వాలని రాజు ను జడ్పీ కార్యాలయంలో ఏఈ శరత్‌ డిమాం డ్‌ చేశారు. దీంతో రాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ.8 వేలు సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌ ద్వారా శరత్‌ తీసుకుంటుండగా అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 06:27 AM