Kishan Reddy: కిషన్‌రెడ్డి ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు
ABN, Publish Date - May 30 , 2025 | 03:52 AM
పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..
టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ విధానాలపైనే స్పష్టతనిచ్చారు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తెలిపారు. కేవలం పార్టీ విధానాలపైనే స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు చురుగ్గా పాల్గొనాలనే దృక్కోణంతో కిషన్‌రెడ్డి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ఎవరి మీదా ప్రత్యేకంగా విమర్శలు చేయలేదని సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర నేతలకు కిషన్‌రెడ్డి హెచ్చరించినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.
Updated Date - May 30 , 2025 | 03:52 AM