BC Welfare Association: బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలి!
ABN, Publish Date - Jul 26 , 2025 | 05:01 AM
ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి జోషికి ఆర్ కృష్ణయ్య వినతి
రాంనగర్, జూలై 25(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం అందజేశారు.
బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో బీసీలకు అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
Updated Date - Jul 26 , 2025 | 05:01 AM