ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjayఫ కాంగ్రెస్‌ది చేతకానితనం:సంజయ్‌

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:33 AM

బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రె్‌సది చేతకానితనం అని, ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రె్‌సది చేతకానితనం అని, ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమని, తెలిసి కూడా ముస్లింలను బీసీ జాబితాలో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు చేర్చారని మండిపడ్డారు.


రిజర్వేషన్లపై హామీ ఇచ్చే ముందు మోదీ ప్రభుత్వాన్ని అడిగి మ్యానిఫెస్టోలో పెట్టారా అని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్‌ బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీ సంఘాలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన సంఘాలు.. కాంగ్రె్‌సను సంకన వేసుకుని ఢిల్లీలో ధర్నా పేరుతో డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.

Updated Date - Apr 03 , 2025 | 04:33 AM