ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Department: వైద్య కళాశాలలకు పాలనాధికారుల నియామకం

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:29 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆస్పత్రులకు ప్రభుత్వం పరిపాలనాధికారులను నియమించింది. 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అదనపు వైద్య విద్య..

  • 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆస్పత్రులకు ప్రభుత్వం పరిపాలనాధికారులను నియమించింది. 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అదనపు వైద్య విద్య సంచాలకులు (ఏడీఎంఈ)గా పదోన్నతులు కల్పించి.. వారిని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లుగా, బోధనా ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా నియమించింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. ఇక అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. వీరికి పోస్టింగులు ఇస్తే కాలేజీల్లో ప్రొఫెసర్లు, డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీల కొరత తీరనుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు కూడా ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఏడీఎంఈ పదోన్నతులు, పోస్టింగుల ప్రకియ్రను పారదర్శకంగా, వేగంగా నిర్వహించిన ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ డాక్టర్‌ నరేంద్రకుమార్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నరహరి, తెలంగాణ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ బీ కిరణ్‌, డాక్టర్‌ మాదాల కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 06:29 AM