ACB: ఏసీబీ అధికారులు అలాంటి ఫోన్లు చేయరు
ABN, Publish Date - May 17 , 2025 | 05:08 AM
ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు.
అలా ఫోన్ చేస్తే ఫిర్యాదు చేయండి: ఏసీబీ డీజీ
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. బాధితులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 94404 46106కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఇటీవల కొంత కాలంగా వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు కొందరు తాము ఏసీబీ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏసీబీ అధికారులెవ్వరూ ఇటువంటి ఫోన్లు చేయరని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - May 17 , 2025 | 06:03 AM