ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ACB: ఆరు నెలల్లో 126 ఏసీబీ కేసుల నమోదు

ABN, Publish Date - Jul 02 , 2025 | 03:57 AM

వరుస దాడులతో అవినీతి అధికారులు, ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 126 కేసులను నమోదు చేసిన అధికారులు 125 మందిని అరెస్టు చేశారు.

  • పట్టుబడినవారిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ!

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): వరుస దాడులతో అవినీతి అధికారులు, ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 126 కేసులను నమోదు చేసిన అధికారులు 125 మందిని అరెస్టు చేశారు. లంచం కేసులకు సంబంధించి ఈ ఆరు నెలల్లో రూ.24,57,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో రూ.27,66,60,526 ఆస్తులను వెలికి తీశారు. ఆ ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.

ఆరు నెలల కాలంలో 129 కేసుల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదికను పంపించామని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ విజయకుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల్లో నమోదు చేసిన 126 కేసుల్లో 80 ట్రాప్‌ కేసులని, 8 అక్రమాస్తుల కేసులని, 11 ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, 14 నేరపూరిత దుష్ప్రవర్తన కేసులని, 10 రెగ్యులర్‌ విచారణలు నిర్వహించామని, 3 అంతర్గత విచారణలు నిర్వహించామని వివరించారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈసారి ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పట్టుబడటం కీలక పరిణామం.

Updated Date - Jul 02 , 2025 | 03:57 AM