CID Probe Twist: చెన్నమనేని కేసులో సీఐడీకి ఆది శ్రీనివాస్
ABN, Publish Date - Apr 24 , 2025 | 03:30 AM
చెన్నమనేని రమేశ్ పౌరసత్వ కేసులో కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదుదారు ఆది శ్రీనివాస్ సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు, ఆధారాలు సమర్పించారు
వాంగ్మూలం నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు, కాంగ్రెస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. సీఐడీ అధికారులను బుధవారం కలిశారు. సీఐడీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారికి అందజేశారు. ఆపై ఆది శ్రీనివాస్ వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేసుకున్నారు. భారత పౌరసత్వం విషయంలో చెన్నమనేని అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గత నెల 17న కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన అనేక కీలక ఆధారాలను ఆది శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు అందించడంతో రమేశ్ విషయంలో అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
Updated Date - Apr 24 , 2025 | 03:30 AM