ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: తల్లిదండ్రులు చదివించలేం అని చెప్పడంతో..

ABN, Publish Date - Jul 17 , 2025 | 04:34 AM

తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది.

  • బాలిక మనస్తాపం.. ఉరివేసుకొని ఆత్మహత్య

నిజాంపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సులేమాన్‌ కూతురు మదిహా(15) పదో తరగతి పూర్తిచేసింది. కామారెడ్డిలోని మైనారిటీ జూనియర్‌ కళాశాలలో సీటు సంపాదించింది. అక్కడ చదివించేందుకు ఆర్థిక స్తోమత లేదని చెబుతూ తల్లిదండ్రులు చదువు మాన్పించారు.

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మదిహా చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు.. ఆమె ఉరివేసుకున్న స్థితిలో చూసి కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - Jul 17 , 2025 | 04:34 AM