ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

10th Class: మార్చి 6 నుంచి పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:43 AM

పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. రంజాన్‌ నేపథ్యంలో పరీక్షలను మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ.నరసింహారెడ్డి తెలిపారు. మార్చి 6న ప్రథమ భాష, 7న ద్వితీయ భాష, 10న తృతీయ భాష, 11న గణితశాస్త్రం, 12న సామాన్యశాస్త్రం, 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పరీక్షలకు ముందే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 04 , 2025 | 04:43 AM