WhatsApp mute alerts: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఆ మెసేజ్‌లను మ్యూట్ చేసి అవకాశం..
ABN, Publish Date - Sep 24 , 2025 | 09:44 AM
వాట్సాప్‌లోని వివిధ గ్రూప్స్ నుంచి వచ్చే వరుస మెసేజ్‌లతో మీకు చిరాకు పుడుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్.. అటువంటి అనవసర మెసెజ్‌లన్నింటినీ ఒకేసారి మ్యూట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది.
వాట్సాప్‌లోని వివిధ గ్రూప్స్ నుంచి వచ్చే వరుస మెసేజ్‌లతో మీకు చిరాకు పుడుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్.. అటువంటి అనవసర మెసెజ్‌లన్నింటినీ ఒకేసారి మ్యూట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది. గ్రూప్ చాట్‌లపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇచ్చే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఫీచర్ @everyone మెసేజ్‌లను మ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది (mute all group chats).
గ్రూప్‌లోని ప్రతి ఒక్కరినీ ట్యాగ్ చేసే నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసే అవకాశం ఈ ఫీచర్ ద్వారా లభిస్తుంది. పదే పదే నోటిఫికేషన్‌ల రావడంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది (@everyone mute). కొత్త అప్డేట్‌తో నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లో Mute @everyone అనే కొత్త ఆప్షన్ వస్తుంది. ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. కావాలనుకునే వినియోగదారులు దీన్ని మాన్యువల్‌గా ఆన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫీచర్ ప్రకారం వాట్సాప్ గ్రూప్‌లో @everyone అని టైప్ చేస్తే గ్రూప్‌లోని అందరినీ మెన్షన్ చేయొచ్చు.
కొత్త ఫీచర్‌తో అలాంటి ఆప్షన్ ఉండదు (WhatsApp notification settings). అన్ని మెసేజ్‌లు వద్దనుకునే వారు తమకు వచ్చే నోటిఫికేషన్లను మ్యూట్ చేసుకోవచ్చు. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో పాల్గొనే టెస్టర్లకు కూడా ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. మరికొన్ని వారాల్లో టెస్టింగ్ కోసం దీన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..
విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..
Read Latest and Technology News
Updated Date - Sep 24 , 2025 | 09:44 AM