ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

WhatsApp-iOS: ఐఓఎస్‌లో త్వరలో కొత్త ఫీచర్.. ఇక వాట్సాప్ యూజర్లకు చికాకు లేనట్టే..

ABN, Publish Date - Aug 22 , 2025 | 01:26 PM

ఐఫోన్‌లో పలు వాట్సాప్ మెసేజీలను ఒకేసారి సెలక్ట్ చేసి కాపీ చేయడంలో ఇబ్బంది పడుతున్న యూజర్ల కోసం వాట్సాప్ ఓ కొత్త ఆఫ్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది బీటా ఫేజ్ వారికే అందుబాటులో ఉన్నప్పటికీ త్వరలో అన్ని ఐఫోన్‌లలో అందుబాటులోకి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp iOS Select Multiple Messages

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌లో పలు మెసేజ్‌లను కాపీ చేసేందుకు ఐఫోన్ యూజర్లు ఇంతకాలం నానా ఇక్కట్లూ పడేవారు. ఐఓఎస్‌లో పలు మెసేజీలు కాపీ చేయడం యాండ్రాయిడ్‌ ఫోన్‌లలో కంటే సంక్లిష్టంగా ఉండేది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ రంగంలోకి దిగింది. పలు మేసేజ్‌లను ఒకేసారి కాపీ చేసేందుకు అనువుగా ఓ కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌లో కొందరు ఎంపిక చేసిన టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు కొన్ని టెక్ న్యూస్ సైట్స్ చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం వీటిని ఐఫోన్ యూజర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ కొత్త ఫీచర్‌‌పై చర్చ నెట్టింట పతాక స్థాయిలో ఉంది. మెనూలోని ఈ కొత్త ఆప్షన్ ద్వారా ఐఫోన్ యూజర్లు పలు మెసేజీలను ఒకేసారి ఎంచుకోవచ్చు. ఆ తరువాత స్క్రిన్ దిగువ భాగంలో ఉన్న ఫార్వర్డ్, డిలీట్, షేర్ బటన్స్ ద్వారా వాటిని డిలీట్ చేయడమో ఇతరులతో పంచుకోవడమో చేయొచ్చు.

ప్రస్తుతం ఐఫోన్‌లో పలు వాట్సాప్ మెసేజీలను ఎంచుకునేందుకు యూజర్లు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. యూజర్లు ముందుగా మెసేజీపై కొంత సేపు ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని సాయంతో పలు మెసేజీలు ఎంచుకున్నాక కనిపించే షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కానీ మెసేజీలు అన్నీ ఒకేసారి కాపీ చేసేందుకు సాధ్యం కాదు. ఈ ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా, త్వరగా యూజర్లు అర్థం కాని రీతిలో ఉందన్న విమర్శ ఉంది. ఈ సమస్యపై వాట్సాప్‌ ఎట్టకేలకు దృష్టి పెట్టిందన్న వార్త ఐఫోన్ యూజర్లలో సంతోషం నింపింది. ఈ ఫీచర్ వీలైనంత త్వరగా అందరికీ అందుబాటులోకి రావాలని పలువురు నెట్టింట కామెంట్స్ పెట్టారు.

ఇవి కూడా చదవండి:

భారతీయులకు ఓపెన్ ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం రూ.399లకే..

వామ్మో.. చాట్‌జీపీటీకి ఇంత డిమాండా.. ఎంత ఆదాయం వస్తోందో తెలిస్తే..

Read Latest and Technology News

Updated Date - Aug 22 , 2025 | 01:36 PM