ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rakhi Tech Gifts 2025: ఈ రాఖీకి మీ సోదరిని ఇలా సర్‌ప్రైజ్ చేయండి.. టాప్ 5 టెక్ డీల్స్

ABN, Publish Date - Aug 07 , 2025 | 04:07 PM

రాఖీ అంటే అన్నచెల్లెళ్ల మధ్య అనుబంధానికి గుర్తు. ఈ ప్రత్యేక రోజున మీ చెల్లెలిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఓసారి ఈ టెక్ గిఫ్ట్‌లను పరిశీలించండి.

Rakhi Tech Gifts 2025

ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి టెక్ గాడ్జెట్లను స్పెషల్ గిఫ్టుగా (Rakhi Tech Gifts 2025) ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ స్పెషల్ డే సందర్భంగా ఈ కామర్స్ సైట్లలో రూ.1999 లోపు కొన్ని ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ గాడ్జెట్స్ స్టైలిష్‌గా ఉండటంతోపాటు మీ సోదరి ముఖంలో చిరునవ్వును కూడా తెప్పిస్తాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

1. రెడ్‌మి మూవ్ స్మార్ట్‌వాచ్

స్మార్ట్‌వాచ్‌లను ప్రస్తుత రోజుల్లో అనేక మంది వినియోగిస్తున్నారు. ప్రత్యేక ఫీచర్లు ఉన్న వీటిని మీ సోదరికి బహుమతిగా అందించవచ్చు. రెడ్‌మి వాచ్ మూవ్ 1.85-అంగుళాల AMOLED స్క్రీన్‌తో బ్రైట్ లుక్ ఇస్తుంది. 140+ వర్కౌట్ మోడ్‌లు, హెల్త్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ చాలా స్పెషల్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని బ్యాటరీ 14 రోజుల వరకు వస్తుంది. దీని ధర ప్రస్తుతం ఆన్ లైన్‌లో రూ.1899–1999గా ఉంది.

2. మివి ఇయర్‌బడ్స్

మ్యూజిక్ లవర్స్‌కి ఇయర్‌బడ్స్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో మివి TWS ఇయర్‌బడ్స్ కాంపాక్ట్, స్టైలిష్ డిజైన్‌తో ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్‌తో క్లియర్ సౌండ్, డీప్ బేస్ ఇస్తాయి. బ్యాటరీ బ్యాకప్ 45–72 గంటల వరకు ఉంది. అంటే రోజుల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఇవి ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఈ రూ.1099–1499 మధ్య లభిస్తున్నాయి.

3. ఆంబ్రేన్ 10,000mAh పవర్ బ్యాంక్

పవర్ బ్యాంక్ ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరికీ ఉపయోగపడుతుంది. ఆంబ్రేన్ 10,000mAh పవర్ బ్యాంక్ స్లిమ్, పోర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కాలేజీకి వెళ్లే సోదరీ, ట్రిప్స్‌లో తిరిగే సిస్టర్స్‌కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీని ధర ప్రస్తుతం రూ.1500 లోపే ఉంది. దీని ద్వారా మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఫోన్ ఛార్జ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ గిఫ్ట్ హెల్ప్ చేస్తుంది.

4. వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 నెక్‌బ్యాండ్

మీ సోదరీమణులకు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 నెక్‌బ్యాండ్ బెస్ట్ ఛాయిస్. 30 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్నెటిక్ డిజైన్‌తో ఈ నెక్‌బ్యాండ్ అదిరిపోతుంది. సౌండ్ క్వాలిటీ బాగుండటంతోపాటు దీని ధర రూ.1999 లోపు ఉండటం విశేషం. డిస్కౌంట్స్‌తో మరింత తక్కువకు దొరుకుతుంది. స్టైల్‌తో పాటు కంఫర్ట్ కోరుకునే వారికి ఈ గిఫ్ట్ తప్పకుండా నచ్చుతుంది.

5. హనీవెల్ మినీ USB ఫ్యాన్

వేసవి కాలంలో చల్లదనం కోసం హనీవెల్ మినీ USB ఫ్యాన్ సూపర్ ఆప్షన్. ఈ చిన్న రీఛార్జబుల్ ఫ్యాన్ డెస్క్ వినియోగానికి చక్కగా ఉపయోగపడుతుంది. ట్రావెల్‌కి బెస్ట్ ఆప్షన్. కాంపాక్ట్, హ్యాండీగా ఉంటుంది. ఆన్ లైన్‌లో ఇది రూ.899–1299 మధ్య లభిస్తుంది. సమ్మర్‌ టైంలో ఎక్కువగా ఉపయోగపడే ఈ గిఫ్ట్ మీ సోదరికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 05:14 PM