Instagram New Features: ఇన్‌స్టాగ్రామ్ నుంచి 3 సరికొత్త ఫీచర్స్.. అవి ఎలా పనిచేస్తాయంటే
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:26 PM
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా ముందుకు సాగుతున్న ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ తాజాగా 3 సూపర్ ఫీచర్లతో వచ్చేసింది. యూజర్ అనుభవాన్ని మరింత ఎంజాయ్ చేయించేందుకు, వాటిని మరింత వ్యక్తిగతంగా మార్చేందుకు ఈ కొత్త ఫీచర్లు కీలకంగా మారనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చేశాయి. ఈ పాపులర్ ప్లాట్‌ఫామ్ తాజాగా 3 కొత్త ఫీచర్స్‌ని (Instagram 3 new features) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ వల్ల మీ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ కావడమే కాదు, వాళ్లు ఏం షేర్ చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. దీంతోపాటు మీకు నచ్చిన రీల్స్, పోస్ట్‌లను మీరు కూడా రీపోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ స్పెషల్ ఏంటి? ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.
రీపోస్ట్ ఫీచర్
ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన రీపోస్ట్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన పబ్లిక్ రీల్స్, పోస్ట్‌లను మీరు మీ ఫాలోవర్స్‌తో రీపోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు స్టోరీలలో మాత్రమే షేర్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మీరు రీపోస్ట్ చేసిన కంటెంట్ మీ ప్రొఫైల్‌లో ఒక స్పెషల్ ట్యాబ్‌లో కనిపిస్తుంది. అంటే మీరు షేర్ చేసిన కంటెంట్‌ను తర్వాత మళ్లీ చూసుకోవచ్చు.
కానీ మీరు రీపోస్ట్ చేసిన కంటెంట్ క్రెడిట్ మాత్రం ఒరిజినల్ క్రియేటర్‌కి ఇస్తుంది. అదే సమయంలో ఆ కంటెంట్‌ను మీరు ఫాలో అవని వాళ్లకూ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అంటే, మీరు కంటెంట్‌ను విస్తృతంగా షేర్ చేయగలుగుతారు. రీపోస్ట్ చేయాలంటే కంటెంట్ క్రింద కనిపించే కొత్త 🔁 ఐకాన్‌పై ట్యాప్ చేసి, థాట్ బబుల్లో మీ కామెంట్‌ని టైప్ చేసి సేవ్ చేస్తే చాలు.
కొత్త ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్
మరొక కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్. ఇది స్నాప్‌చాట్‌లో ఉన్న Snap Mapలా ఉంటుంది. అంటే, మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో మ్యాప్‌లో చూడొచ్చు (అవును, వాళ్లు షేర్ చేస్తేనే). మీ లొకేషన్ ఎప్పుడు షేర్ చేయాలో, ఎవరిదగ్గర షేర్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. అప్పుడు మాత్రమే షేర్ అవుతుంది, మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా ఆన్ చేస్తే. ఈ మ్యాప్ ద్వారా మీరు ఫాలో అవుతున్నవాళ్లు ఏ లొకేషన్ నుంచి ఏ రకమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాదు, లొకేషన్ ట్యాగ్ చేసిన రీల్స్, పోస్ట్‌లు, స్టోరీస్ కూడా ఈ మ్యాప్‌లో కనిపిస్తాయి. కానీ ఇవి 24 గంటల పాటు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఫీచర్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌లో టీనేజర్స్ విషయంలో ప్యారెంట్స్‌కి స్పెషల్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ల బిడ్డలు ఎవరి దగ్గర లొకేషన్ షేర్ చేస్తున్నారో మానిటర్ చేయొచ్చు. ఏదైనా లొకేషన్ షేర్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది.
Reels Tabలో కొత్త Friends సెక్షన్
ఇక మూడో కొత్త ఫీచర్ Friends Tab in Reels. ఇది రీల్స్ ట్యాబ్‌లో ఒక స్పెషల్ సెక్షన్. ఇందులో మీ ఫ్రెండ్స్ ఏ రీల్స్ ఇష్టపడ్డారో, ఏవి షేర్ చేశారో చూసుకోవచ్చు. అలాగే, మీరు షేర్ చేసిన రీల్స్ గురించి చర్చలు మొదలెట్టడమూ ఈ ఫీచర్‌తో చాలా ఈజీ అవుతుంది. ఇంకా మీరు ఇష్టం లేకపోతే, మీ లైక్స్, కామెంట్స్‌ను హైడ్ చేయొచ్చు. అలాగే, మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చే యాక్టివిటీ బబుల్స్‌ను కూడా మ్యూట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 09:27 PM