ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AI Adoption in Workplaces: పెరుగుతున్న ఏఐ వినియోగం.. భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 71 శాతం మంది..

ABN, Publish Date - Nov 14 , 2025 | 10:40 PM

భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్‌నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.

India AI adoption

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ కార్యాలయాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇక్కడి ఉద్యోగుల్లో సుమారు 71 శాతం మంది వివిధ అవసరాల కోసం ఏఐపై ఆధారపడుతున్నట్టు తేలింది. వర్క్ ప్లేస్ ట్రెండ్స్ 2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి (AI Adoption in Indian Work places).

ఈ సర్వే ప్రకారం, భారతీయ వర్కర్లలో 71 శాతం మంది రోజూ తమ ఆఫీసులో ఏఐని వినియోగిస్తున్నారు. కొత్త ఐడియాలు, సమస్యలకు పరిష్కారాలు, కెరీర్ ప్లానింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏఐ సాయం తీసుకుంటున్నారు. ఏఐని కేవలం ఒక సాధనంగానే కాకుండా ఆఫీసులో విశ్వసనీయ పార్టనర్‌గా భావిస్తున్నారు.

ఏఐ రాకతో ఉద్యోగుల తీరుతెన్నుల్లో కూడా మార్పులు వస్తున్నట్టు సర్వేలో తేలింది. ఏఐతో కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్న అనేక మంది తరచూ జాబ్స్ మారుతున్నారు. అనేక మంది పార్ట్ టైమ్ జాబ్స్, మూన్ లైటింగ్ వంటివి కూడా చేస్తున్నారు. ఏఐ సాయం తీసుకుంటూ అనేక మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను కూడా సాధిస్తున్నారు.

అయితే, మారుతున్న ఉద్యోగుల తీరు సంస్థలకు నచ్చట్లేదని కూడా సర్వేలో తేలింది. ఇలా తరచూ జాబ్స్ మారడం, ఆఫీసులో షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం వంటివి ఉద్యోగుల్లో అనాసక్తికి సంకేతాలుగా సంస్థలు చూస్తున్నాయట. ఉద్యోగుల్లో స్వతంత్ర ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థల్లో పని సంస్కృతుల్లో కూడా మార్పులు రావాలని సర్వే అభిప్రాయపడింది.

ఇక ఏఐతో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందన్న అంచనాలు భయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే టెక్ రంగ నిపుణులు అనేక మంది హెచ్చరికలు చేస్తున్నారు. అయితే, కొత్త ఉద్యోగాల సృష్టి కూడా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు నేర్చుకునే వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భరోసా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు

టాప్ 100 యాప్స్‌ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు

Read Latest and Technology News

Updated Date - Nov 14 , 2025 | 10:46 PM