ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mastering Snap Layouts: విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

ABN, Publish Date - Nov 11 , 2025 | 05:53 PM

మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్‌ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.

Mastering Snap Layouts

విండోస్ వాడే తమ వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త కొత్త అప్‌డేట్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. వినియోగదారుల పని తగ్గించేలా.. వారికి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా విండోస్‌లో అప్‌డేట్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం విండోస్ 11 వర్సన్ అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11ను మునుపటి వర్సన్ల కంటే అద్భుతంగా అప్‌డేట్ చేసి.. కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మల్టీ టాస్కింగ్ చేసే వారు ఎక్కువ విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ సంఖ్యలో విండోలు ఓపెన్ చేసినపుడు చాలా కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.

మనకు అవసరమైన విండో ఎక్కడుందో వెతుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని ద‌ృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో ఓ అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్‌ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది. ఒక వేళ విండోస్ 10లో ఈ ఫీచర్‌ను వాడాలంటే మాత్రం థర్డ్ పార్టీ టూల్స్ అయిన ‘ఫ్యాన్సీ జోన్’, మైక్రోసాఫ్ట్ పవర్‌టాయిస్’ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్‌ను ఎలా వాడుకోవాలి?

  • ఈ ఫీచర్‌ను వాడటం చాలా చాలా సులభం. ముందుగా కర్సర్‌ను మాగ్జిమైజ్ ఐకాన్ దగ్గరకు తీసుకుపోవాలి.

  • ఆ ఐకాన్ మీద కొన్ని సెకన్ల పాటు కర్సర్‌ను పెట్టగానే మినీ పాప్అప్ విండో ఓపెన్ అవుతుంది.

  • ఆ పాప్‌అప్‌ విండోలో గ్రిడ్స్ ఉంటాయి.

  • ఏ గ్రిడ్స్ లేఅవుట్‌లో అయితే మీకు విండోలు షో కావాలని అనుకుంటారో ఆ గ్రిడ్స్ లేఅవుట్‌పై క్లిక్ చేయాలి.

  • అందులో మీరు ఇప్పటి వరకు ఓపెన్ చేసిన విండోలు మొత్తం ఓపెన్ అవుతాయి.

  • అన్నీ ఒకే చోట స్క్రీన్‌పై కనిపిస్తాయి.

  • మీ ప్రియారిటీని బట్టి ఆ గ్రిడ్స్ మార్చుకోవటానికి వీలుంటుంది.

  • విండోస్ ప్లస్ జెడ్ కీలను క్లిక్ చేయటం ద్వారా కూడా స్నాప్ లేవుట్‌ను వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జాకీచాన్ చనిపోయాడంటూ వార్తలు.. అసలు నిజం ఏంటంటే..

ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత

Updated Date - Nov 11 , 2025 | 06:00 PM