ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mappls Features: గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీని ఇస్తున్న మ్యాపుల్స్.. ఈ ఫీచర్స్ మాత్రం అదుర్స్!

ABN, Publish Date - Oct 20 , 2025 | 03:21 PM

భారతీయ ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన దేశీయ నావిగేషన్ యాప్‌ మ్యాపుల్స్‌లో టాప్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Mappls Top 5 Features

ఇంటర్నెట్ డెస్క్: నావిగేషన్ యాప్ అంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. కానీ దేశీయంగా రూపొందించిన మరో యాప్ కూడా ప్రస్తుతం భారతీయులను ఆకట్టుకుంటోంది. మ్యాప్‌మైఇండియా రూపొందించిన ఈ యాప్ పేరు మ్యాపుల్స్. భారతీయ రోడ్లు, ట్రాఫిక్‌కు అనుగుణంగా పలు ప్రత్యేక ఫీచర్లు ఇందులో జోడించారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇచ్చేలా డిజైన్ చేశారు. మరి మ్యాపుల్స్‌లో యూజర్స్‌ను ఆకట్టుకుంటున్న టాప్ 5 ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Mappls features India).

మ్యాపుల్స్‌ పిన్

మ్యాపుల్స్‌ ఫీచర్స్‌‌లో అత్యంత ప్రత్యేకమైనది పిన్ ఫీచర్. ఇదో డిజిటల్ పిన్ కోడ్. దీని సాయంతో భారత్‌లోని ప్రతి లొకేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించొచ్చు. భారత్‌లో పిన్ కోడ్స్, అడ్రస్‌లు అసంపూర్ణంగా ఉంటూ జనాలను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పిన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. గూగుల్‌లోని ప్లస్ కోడ్ లాగా ఇది కూడా భారతీయ డీజీ పిన్‌తో అనుసంధానమైంది. దీంతో, కోరుకున్న అడ్రస్‌కు సులువుగా చేరుకోవచ్చు.

టోల్ అండ్ ట్రిప్ కాలిక్యులేటర్

మ్యాపుల్స్‌తో ప్రయాణ ఖర్చులను కూడా లెక్కించుకోవచ్చు. ఇందుకు టోల్ అండ్ ట్రిప్ కాలిక్యులేటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇంధన ఖర్చులు, టోల్ చార్జీలకు సంబంధించి చక్కటి అంచనాలను ఇస్తుంది. సుదీర్ఘ ట్రిప్స్‌పై వెళ్లే వాళ్లు, కమర్షియల్ డ్రైవర్లకు ఈ ఫీచర్ ఉపయుక్తం.

3డీ ఫంక్షన్ వ్యూ

కొత్త ప్రాంతాల్లో ప్రయాణించే వారికి భారత్‌లోని ఫ్లైఓవర్లు, క్రాస్‌రోడ్స్‌ మీదుగా ప్రయాణం ఒక సవాలు అని చెప్పకతప్పదు. అయితే, మ్యాపుల్స్‌లోని 3డీ జంక్షన్ వ్యూతో భారీ క్రాస్ రోడ్స్‌ను చక్కగా అర్థం చేసుకుని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా వెళ్లాల్సిన మార్గంలో ప్రయాణించవచ్చు. క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న దారులు, వాటిపై ఉన్న లాండ్ మార్క్స్, ఎగ్జిట్ పాయింట్స్ వంటివన్నీ స్పష్టంగా 3డీ వ్యూ ఫీచర్‌లో చూడొచ్చు. ఇస్రోతో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయడంతో అత్యంత కచ్చితమైన మార్గనిర్దేశనం డ్రైవర్‌లకు లభిస్తుంది.

లైవ్ ట్రాఫిక్ టైమర్

ఏఐ ఆధారిత లైవ్ ట్రాఫిక్ టైమర్ కూడా మ్యాపుల్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బెంగళూరులో అందుబాటులో ఉంది. దీని సాయంతో ప్రయాణికులు ట్రాఫిక్ లైట్ కౌంట్‌డౌన్‌ను చూస్తూ ఎప్పుడు రెడ్ లైట్, లేదా గ్రీన్ లైట్ పడుతుందో తెలుసుకోవచ్చు.

రోడ్ అలర్ట్స్

వీధుల్లో గొయ్యిలు లేదా స్పీడ్ బ్రేకర్ల సమాచారం గురించి రోడ్ అలర్ట్స్ ద్వారా యూజర్లు తెలుసుకోవచ్చు. కొత్త రహదారుల మీదుగా ప్రయాణించే వారికి ఈ ఫీచర్ అత్యవసరం. మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఫీచర్స్‌ ఉన్న మ్యాపుల్స్‌ను మీరూ ఓసారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

స్మార్ట్ ఫోన్‌లకూ ఎక్స్‌పైరీ డేట్.. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..

అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా

Read Latest and Technology News

Updated Date - Oct 20 , 2025 | 07:06 PM