Smart Phone Expiry Date: స్మార్ట్ ఫోన్‌లకూ ఎక్స్‌పైరీ డేట్.. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:38 PM
స్మార్ట్‌ఫోన్‌కూ ఎక్స్‌పైరీ డేట్ ఉందన్న విషయం మీకు తెలుసా? మరి ఈ డేట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటో? డేట్ ముగిశాక ఏమవుతుందో చూద్దాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది తన ఫోన్ కొన్నేళ్ళ పాటు పనిచేస్తుందనే భావనలో ఉంటారు. అయితే, ఎంత ఖరీదు పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్‌లైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల లాగానే ఎక్స్‌పైరీ డేట్ తరువాత ఫోన్ల సామర్థ్యం తగ్గుతుంది. అయితే, ఈ ఎక్స్‌పైరీ డేట్‌ను ఫోన్‌పై లేదా ఫోన్ బాక్స్‌పైనా ముద్రించరు. ఎవరికి వారు ఈ డేట్‌పై అవగాహన కల్పించుకోవాలి (Smart Phone Expiry Date).
ఫోన్ ఎక్స్‌పైరీ డేట్ అంటే..
ఫోన్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిందంటే ఫోన్ పని చేయడం మానేస్తుందన్న అర్థం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ డేట్ తరువాత ఫోన్ సామర్థ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోతుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్, సాఫ్ట్‌వేర్ సపోర్టు వంటివి నిలిచిపోతాయి. చివరకు బ్యాటరీ లైఫ్ కూడా తగ్గి వ్యవస్థ సెక్యూరిటీ మొత్తం బలహీనపడుతుంది (How Long will a Phone Last).
నిపుణులు చెప్పేదాని ప్రకారం స్మార్ట్ ఫోన్‌లు సగటున మూడు నుంచి ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తాయి. మీరు ఫోన్ ఎలా వాడుతున్నారన్న అంశంపై కూడా ఫోన్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్, శామ్‌సంగ్ వన్‌ప్లస్ లాంటి టాప్ ఫోన్‌లు ఐదేళ్ల పాటు చక్కగా పనిచేస్తాయి. మిడ్ రేంజ్ ఫోన్ల సామరథ్యం మాత్రం మూడేళ్ల తరువాత నుంచి క్రమంగా తగ్గిపోతుంది (Smart Phone Battery life).
ఫోన్ ఎక్స్‌పైరీ డేట్‌కు సంకేతాలు
ఫోన్ అకస్మాత్తుగా హ్యాంయిపోవడం లేదా నెమ్మదించడం ఇందుకు ప్రధాన సంకేతం. కొన్ని సార్లు బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. అకస్మా్తుగా ఫోన్ షట్ డౌన్ అయిపోతుంది. యాప్స్ తరచూ క్రాష్ అవుతుంటాయి. ఫోన్‌కు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా నిలిచిపోతాయి. చార్జింగ్ పోర్టులు, స్పీకర్లు పనిచేయడం మానేస్తాయి. వీటిల్లో ఏ కొన్ని సమస్యలు మీకు ఎదురవుతున్నా ఫోన్ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడినట్టు భావించాలి. కొత్త ఫోన్ కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఏ బ్రాండ్ ఫోన్ అయినా ఐదేళ్ల వరకూ ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. గూగుల్, శామ్‌శాంగ్ లాంటి ఫోన్లకు ఏడేళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తుంటాయి. అయితే, ఏ ఫోన్‌లోని బ్యాటరీలనైనా గరిష్ఠంగా 800 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. అంటే, 2.5 ఏళ్లు లేదా మూడేళ్ల తరువాత బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోవడం మొదలవుతుంది. దీన్ని బట్టి ఎక్స్‌పైరీ డేట్ వచ్చినట్టు భావించాలి.
ఇవి కూడా చదవండి
విండోస్ 10కు సపోర్టు నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్.. చివరి తేదీ ఎప్పుడంటే..
అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా
Read Latest and Technology News