ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

iPhone 17 India Launch: టెక్ అలర్ట్..సెప్టెంబర్ 19న భారత మార్కెట్లోకి ఐఫోన్ 17 సిరీస్

ABN, Publish Date - Sep 18 , 2025 | 01:29 PM

టెక్ ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ మరోసారి తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లతో ముందుకొస్తుంది. సెప్టెంబర్ 19 నుంచి ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి.

iPhone 17 India Launch

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 17 లైనప్ భారత మార్కెట్లో (iPhone 17 India Launch సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పాటు ఆపిల్ చరిత్రలో మొట్టమొదటి ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది. ఈ కొత్త ఫోన్‌లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ SE3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా లాంచ్ అవుతున్నాయి.

ఐఫోన్ 17 సిరీస్ హైలైట్స్

గత వారం జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ ఎయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఇప్పటివరకూ ఆపిల్ తయారు చేసిన అత్యంత సన్నని ఐఫోన్. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు. ఈ సిరీస్‌లోని ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి.

వీటి ధరలు ఎలా ఉన్నాయంటే

  • ఐఫోన్ 17 (256GB): రూ. 82,900 నుంచి..

  • ఐఫోన్ 17 ప్రో (256GB): రూ. 1,34,900

  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB): రూ. 1,49,900

  • ఐఫోన్ ఎయిర్ (256GB): రూ. 1,19,900 నుంచి..

ఆపిల్ త్వరలో..

ఈ ఫోన్‌లు ఆపిల్ రిటైల్ స్టోర్‌లలో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే), ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ ఫోన్‌లు లభిస్తాయి. ఆపిల్ త్వరలో నోయిడాలో కొత్త స్టోర్, ముంబైలో రెండో స్టోర్‌ను కూడా ప్రారంభించనుంది. క్రోమా, ఇంగ్రామ్ మైక్రో ఇండియా, విజయ్ సేల్స్ వంటి పలు స్టోర్లు ఈ ఫోన్లపై డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 01:29 PM