ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telecom Users: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌ మరింత ఈజీ

ABN, Publish Date - Jun 13 , 2025 | 03:47 PM

దేశంలో మొబైల్ ప్లాన్ మార్పుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టెలికం శాఖ (DoT) కీలక మార్పులను ప్రకటించింది. వినియోగదారుల (Telecom Users) అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Telecom Users

దేశంలో మొబైల్ వినియోగదారులకు (Telecom Users) గుడ్ న్యూస్ వచ్చేసింది. టెలికం శాఖ (DoT) మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. జూన్ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా టెలికాం ప్లాన్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఈ మార్పు ప్రకారం మీరు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ లేదంటే పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌కు మారిన తర్వాత, తదుపరి మార్పు కోసం కేవలం 30 రోజుల వేచి ఉంటే సరిపోతుంది.

OTP ఆధారిత మార్పు

ఇది వరకు ఈ వ్యవధి 90 రోజులుగా ఉండేది. అంటే 30 రోజుల తర్వాత మీకు ఆ ప్లాన్ నచ్చకుంటే మళ్లీ మారిపోవచ్చు. ప్రస్తుతం, మీరు OTP ద్వారా మీ ప్లాన్ మార్చుకునే ఛాన్సుంది. ఈ ప్రక్రియలో మీ ఆధార్ లేదా డిజిలాకర్ ద్వారా మీ వివరాలు ధృవీకరించబడతాయి. ఫిజికల్ KYC కూడా అవసరం లేదు. మీరు 30 రోజుల కూలింగ్ ఆఫ్ సమయంలో ఉంటే, ఫిజికల్ KYC ప్రక్రియ ద్వారా ప్లాన్ మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో మీ వివరాలు ఆథారైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్ వద్ద ధృవీకరించబడతాయి.

ప్లాన్ మార్చడం ఎలా?

  • ఆన్‌లైన్ ద్వారా మీరు మీ టెలికం ప్రొవైడర్ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి

  • Prepaid to Postpaid లేదా Postpaid to Prepaid మార్పు ఆప్షన్ ఎంచుకోండి

  • మీ వివరాలు నమోదు చేసి, OTP ద్వారా ధృవీకరించండి

  • కొన్ని సందర్భాల్లో కొత్త SIM కార్డ్ డెలివరీ కోసం షెడ్యూల్ చేసుకోవచ్చు

  • ఫిజికల్ KYC ద్వారా మీరు టెలికం ప్రొవైడర్ అధికారిక పాయింట్ ఆఫ్ సేల్ వద్దకు వెళ్లి, మీ ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను చూపించాలి

  • మీ వివరాలు ధృవీకరించబడిన తర్వాత మీ ప్లాన్ మారుతుంది

లాభాలు (Telecom Users)

  • ఫిజికల్ KYC లేకుండా, మీరు ఇంటి నుంచే మీ ప్లాన్ మార్చుకోవచ్చు

  • ఈ మార్పు ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది. విరామ సమయం 30 నిమిషాలకు మించరాదు

  • మీరు మీకు అనుకూలమైన సమయంలో మీ ప్లాన్ మార్పు చేసుకోవచ్చు

  • ఈ మార్పులు టెలికం సేవలను మరింత సులభతరం చేస్తాయి. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ మార్చి, సేవలను మెరుగుపరచుకోండి

  • ఒకసారి ప్లాన్ మార్చిన తర్వాత, తదుపరి మార్పు కోసం 30 రోజుల వేచి ఉండాలి

  • కానీ జమ్మూ కశ్మీర్ లైసెన్స్ సర్వీస్ ఏరియా బల్క్ మొబైల్ కనెక్షన్ కేటగిరీకి చెందిన వినియోగదారులు OTP ఆధారిత మార్పు ప్రక్రియను ఉపయోగించలేరు

ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 03:52 PM