ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Flight Mode Uses: స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..

ABN, Publish Date - Aug 26 , 2025 | 10:26 PM

స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌‌ను కేవలం విమాన ప్రయాణాలప్పుడే కాకుండా రోజువారీ కూడా వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్‌తో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Flight Mode benefits

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్‌ను చూసే ఉంటారు. కొన్ని ఫోన్‌లలో ఇది ఎయిరోప్లేన్ మోడ్ అనే పేరుతో కూడా కనిపిస్తుంది. రెండూ ఒకటే. వీటి పేరుకు తగ్గట్టే విమాన ప్రయాణాల సందర్భంగా జనాలు ఈ మోడ్‌ను ఆన్ చేస్తారు. ఈ ఆప్షన్ ఆన్ చేయగానే ఫోన్‌లోని వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు అన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా విమాన ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య రేడియో సిగ్నల్స్ ద్వారా జరిగే సమాచార బట్వాడాకు స్మార్ట్ ఫోన్ రేడియో సిగ్నల్స్ ఆటంకాలు కలిగించకూడదనే ఉద్దేశంతో వీటిని ఆన్ చేస్తారు. అయితే, విమానాల్లోనే కాకుండా ఫ్లైట్ మోడ్‌తో అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నెట్‌వర్క్ కవరేజీ లేని చోట స్మార్ట్ ఫోన్ నిరంతరంగా సిగ్నల్ కోసం వెతుకుతూనే ఉంటుంది. దీని వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఇలాంటప్పుడు స్మార్ట్ ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోదు.

ఫోన్ త్వరగా చార్జ్ చేసుకోవాలంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి చార్చ్ చేయాలని కూడా నిపుణులు చెబుతున్నారు. చార్జింగ్ వైర్‌ను కనెక్ట్ చేసే ముందే ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి. అప్పుడు చార్జింగ్ వేగం సగటున 20 నుంచి 25 శాతం మేర పెరుగుతుందట.

చిన్న పిల్లలకు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి యూట్యూబ్ వీడియోలు చూసేందుకు స్మార్ట్ ఫోన్‌లు ఇచ్చేముందు ఈ ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు పొరపాటున లింక్స్‌పై క్లిక్ చేసినా ఎలాంటి అపాయం ఉండదు.

ఫోన్‌కు సిగ్నల్ అందని సమయంలో డివైజ్ మరింత వేగంగా సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫోన్‌ కాస్త వేడెక్కినట్టుగా ఉంటుంది. అదే, ఫ్లైట్ మోడ్ ఎనేబుల్ చేస్తే మాత్రం ఫోన్ చల్లబుడుతుంది.

ఇక చదువుకునే సమయాల్లో లేదా ఏదైనా పనిపై ఏకాగ్రత పెట్టాల్సి వచ్చినప్పుడు ఫోన్‌ను ఎయిరోప్లేన్ మోడ్‌లో పెట్టుకుంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు.

ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పటికీ కూడా వైఫై లేదా బ్లూటూత్ కనెక్టివిటీని ఆన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఫోన్‌కు వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను కనెక్ట్ చేసుకోవడం, వైఫై ద్వారా వివిధ యాప్స్‌ను వినియోగించుకోవడం వంటివి చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌లో సీక్రెట్ సెట్టింగ్స్.. వీటిని సరిగ్గా వాడుకుంటే..

వామ్మో.. ఇంత చిన్న సైజు మొబైల్ ఫోన్‌లు కూడా ఉంటాయని మీకు తెలుసా

Read Latest and Technology News

Updated Date - Aug 26 , 2025 | 10:33 PM