ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Wifi Security: మీ ఇంటి వైఫై హ్యాక్ కాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN, Publish Date - May 12 , 2025 | 04:24 PM

మీ ఇంటి రౌటర్ హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఐదు టిప్స్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Home WiFi Security

ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ముందు జనాలు అనేక విషయాలు ఆలోచిస్తారు. ధర, ప్లాన్, స్పీడ్ ఇలా అన్నీ ఆలోచించాకే కనెక్షన్ తీసుకుంటారు. ఇక ఆ తరువాత వైఫై గురించి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోరు. ఇలా చేస్తే చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంటి వైఫై హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వైఫై రౌటర్ ఏర్పాటు చేసుకున్నాక దాని డీఫాల్ట్ ఎస్ఎస్‌ఐడీని కచ్చితంగా మార్చుకోవాలి. వ్యక్తిగత వివరాలేవీ వెల్లడి కానీ విధంగా పేరు ఎంచుకోవాలి. ఈ చిన్న పనితోనే వెలకట్ట లేని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.


వైఫై పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇతరులు ఈజీగా గెస్ చేయలేని విధంగా ఉండాలి. వైఫై పాస్‌వర్డ్ ఎంత ప్రత్యేకంగా ఉంటే హ్యాకింగ్ నుంచి అంత మేరకు రక్షణ లభిస్తుంది. పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని, వాటిని దాచిపెట్టుకునేందుకు పాస్ వర్డ్ మేనేజర్ వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. పాస్‌వర్డ్‌లో కనీసం 20 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. అంకెలు, అక్షరాలు, సింబల్స్ వంటివాటిని కలిపి తయారు చేసుకోవాలి.

సైబర్ భద్రత కోసం వైఫై సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం అవసరం. దీంతో, చిన్న చిన్న సాఫ్ట్‌వేర్‌ లోపాలను కూడా చక్కదిద్దుకోవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకునేందుకు వీపీఎన్ కూడా ఎంతో కీలకం. వీపీఎన్‌తో మీ ఐపీ అడ్రస్ గురించి ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్ కార్యకలాపాలు కూడా ఎన్‌క్రిప్ట్ రూపంలో జరుగుతాయి కాబట్టి భద్రతకు ఢోకా ఉండదు.


ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే సాధారణ రౌటర్‌కు బదులు మరింత మెరుగైన రౌటర్ కొనుగోలు చేయడం కూడా సైబర్ భద్రతకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఇంటర్నట్ వేగం, రేంజ్ కూడా పెరుగుతాయి. భద్రత కూడా మరింత పటిష్ఠమవుతుంది. అధునాత రౌటర్‌లలో ఫైర్ వాల్స్, వీపీఎన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి సైబర్ భద్రతకు ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి, మీ వ్యక్తిగత సమాచారం భద్రంతా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

AIతో GenZ పెళ్లిళ్లు.. తాజా సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు

ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Read Latest and Technology News

Updated Date - May 12 , 2025 | 04:29 PM