ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrayaan 2 Records: చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2.. ఇస్రోకు కీలక సమచారం..

ABN, Publish Date - Oct 19 , 2025 | 11:11 AM

కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇస్రో వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని తెలిపింది.

Chandrayaan 2 Records

చంద్రయాన్ 2లోని లూనార్ ఆర్బిటర్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఇంజెక్షన్ (సీఎమ్ఈ)ల ప్రభావం గురించి తొలిసారి కీలక సమాచారాన్ని సేకరించింది. ఆ విషయాలను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శనివారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. లూనార్ ఆర్బిటర్‌లోని అస్మోస్‌ఫెరిక్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కరోనల్ మాస్ ఇంజెక్షన్‌పై పరిశోధన చేయటం సాధ్యమైందని ఇస్రో తెలిపింది.

2024, మే 10న కొంత సమయం పాటు చంద్రుడిపై ఎడ తెరపిలేకుండా సూర్యుడి కరోనల్ మాస్ ఇజెక్షన్ల ప్రభావం పడినట్లు గుర్తించామని వెల్లడించింది. కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని ఇస్రో తెలిపింది. మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవటం వల్ల చందుడ్రిపై సూర్యుడి ప్రభావం చాలా సులభంగా పడుతోందని పేర్కొంది.

కరోనల్ మాస్ ఇజెక్షన్ అంటే ఏమి?...

సూర్యుడి కరోనాలో భారీ సంఖ్యలో ప్లాస్మా, మాగ్నటిక్ ఫీల్డ్స్ పేలడాన్ని కరోనల్ మాస్ ఇజెక్షన్ అంటారు. దీని వల్ల సూర్యుడి బయటి వాతావరణ నుంచి భారీ సంఖ్యలో హైడ్రోజన్, హీలియం స్పేస్‌లోకి వెలువడుతాయి. ఇవి చంద్రుడి లాంటి వాటిని తాకినపుడు తీవ్ర ప్రభావం పడుతుంది. వాతావరణం, ఉపరితలాల్లో మార్పు చోటుచేసుకుంటుంది. అయితే, భూమికి దీని నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే భూమి మాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఇలాంటి వాటినుంచి రక్షణ కల్పించే లేయర్ ఉంది. కానీ, చంద్రుడికి ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అందువల్లే సూర్యుడి వల్ల మార్పులకు లోనవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆ దేశంలో వెరైటీ దీపావళి.. ఎన్ని రోజులంటే..

ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

Updated Date - Oct 19 , 2025 | 11:41 AM