ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Worst Places to Put Your Wi-Fi Router: ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

ABN, Publish Date - May 16 , 2025 | 10:21 PM

సాధారణంగా చేసే కొన్ని పొరపాట్ల వల్ల రౌటర్ వైఫై సిగ్నల్ సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పొరపాట్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్నా రౌటర్ నుంచి సరిగా సిగ్నల్ అందక ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏంటో తెలీక తలబాదుకుంటూ ఉంటారు. తెలీక చేసే కొన్ని పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది తమ రౌటర్‌ను ఎవరి కంటపడకుండా ఓ మూల అమర్చాలని అనుకుంటారు. ఇదే అతిపెద్ద తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వైఫై సిగ్నల్స్ గాల్లో చాలా దూరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తాయి. కానీ దారిలో గోడలు వంటివి ఏమైనా అడ్డం వస్తే మాత్రం సిగ్నల్ స్ట్రెంగ్త్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొందరు రౌటర్‌ను నేలమీద పెడుతుంటారు. ఇది అతిపెద్ద తప్పు. రౌటర్ కూడా సాధారణ బల్బు లాంటిదే. బల్బును పైన అమర్చితేనే గది అంతా వెలుగు వస్తుంది. ఇంట్లో అంతటా వైఫై సిగ్నల్ అందాలంటే రౌటర్‌ను కచ్చితంగా ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. టేబుల్ పైన లేదా షెల్ఫ్‌పైనా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోడకు కనీసం అడుగు దూరంలో ఉండేలా దీన్ని పెట్టుకోవాలి.


కొందరు సోఫాల వెనకాల కూడా పెడుతుంటారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. వైఫై సిగ్నల్ మధ్య. మీరు వాడే డివైజ్‌ల మధ్య అడ్డంకులు ఎంత తక్కువగా ఉంటే సిగ్నల్ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైఫై రౌటర్‌ను ఎప్పుడూ కంటికి కనిపించేలా అమర్చుకోవాలి.

వైఫై రౌటర్‌ను సెల్లార్‌లో ఏర్పాటు చేయడం కూడా తప్పే. ఎక్కువగా ఎక్కడ ఇంటర్నెట్ వినియోగిస్తామో ఆ ప్రాంతంలోనే రౌటర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సెల్లార్‌లో ఉండే వస్తువులు వైఫై సిగ్నల్‌ను అడ్డుకుంటాయి. కాపర్ వైరింగ్ వంటివి కూడా ఆటంకాలుగా మారతాయి. అలాగే రౌటర్లను కప్‌బోర్డుల్లో కూడా దాచి పెట్టకూడదు. కప్‌బోర్డుల చుట్టూ ఉండే గోడలు సిగ్నల్స్‌‌ను అడ్డుకుంటాయి.


రెండు రౌటర్లను పక్కపక్కన పెట్టడం కూడా వాటి సిగ్నల్స్ సామర్థ్యం తగ్గేలా చేస్తుంది. కాబట్టి ఇంట్లో అన్ని చోట్లా వైఫై సిగ్నల్స్ రావాలంటే ఇంటికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో రౌటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

AIతో GenZ పెళ్లిళ్లు.. తాజా సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు

ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Read Latest and Technology News

Updated Date - May 16 , 2025 | 10:27 PM