ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arattai Vs WhatsApp: అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా

ABN, Publish Date - Sep 30 , 2025 | 08:34 PM

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా పేరుపడ్డ దేశీయ మెసేజింగ్ యాప్ అరట్టై ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి వాట్సాప్‌కు, అరట్టైకి మధ్య ఉన్న మౌలికమైన తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Arattai vs WhatsApp

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పృహ భారతీయుల్లో పెరుగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ అరట్టై మెసేజింగ్ యాప్. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా చెబుతున్న ఈ యాప్‌ను జోహో సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్లే స్టోర్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి అరట్టైకి, వాట్సాప్‌కు ఉన్న తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Arattai Vs WhatsApp).

అరట్టై, వాట్సాప్ మౌలికస్థాయిలో దాదాపు ఒకే ఫీచర్స్‌ ఉన్నాయి. టెక్స్ట్ మెసేజీలు, మీడియా ఫైల్స్ షేరింగ్, వాయిస్ నోట్స్, వాయిస్, వీడియో కాల్ ఫీచర్స్ వంటివన్నీ అరట్టైలో అందుబాటులోను ఉన్నాయి. వీటికి తోడుగా అరట్టై కొన్ని అదరపు ఫీచర్లను కూడా జోడించింది. అరట్టైని ఆండ్రాయిడ్ టీవీల నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్‌ వలెనే అరట్టైలో కూడా స్టోరీస్, బ్రాడ్ కాస్ట్ తరహా ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి (Arattai app features).

ఇక వాట్సాప్‌లో వ్యక్తిగత విషయాలు స్టోర్ చేసేందుకు యూ చాట్ అందుబాటులో ఉండగా అరట్టైలో ఇదే ఫీచర్‌ను పాకెట్ పేరిట అందుబాటులోకి తెచ్చారు. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, నోట్స్ వంటివి స్టోర్ చేసుకోవచ్చు (WhatsApp comparison Arattai).

2జీ లేదా 3జీ నెట్వర్క్‌లో కూడా పనిచేసే విధంగా అరట్టైని లైట్ వెయిట్ యాప్‌గా డిజైన్ చేశారు. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ ఫోన్‌లల్లో కూడా ఇది సులువుగా పనిచేయగలదు. దీంతో, వాట్సాప్‌తో పోలిస్తే అరట్టై గ్రామీణ యూజర్లకు మరింత అనువైనది.

అరట్టై పూర్తిగా ఉచితం. ఇందులోని యూజర్ల డాటాను టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కోసం వినియోగించబోమని జోహో ముందే చెప్పింది. అయితే, యూజర్ల డేటా తమ వేదికలన్నిటికీ అనుసంధానమయ్యేలా మెటా తన ఎకోసిస్టమ్‌ను డిజైన్ చేసింది. అరట్టైలో గ్రూప్ చాట్స్ కూడా సాధ్యమే ఒక గ్రూప్‌లో వెయ్యి మంది వరకూ ఉండొచ్చు. వాట్సాప్‌లో ఈ లిమిట్ 1024గా ఉంది.

అయితే, వాట్సాప్‌లో అన్ని రకాల సమాచార మార్పిడులకు ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ను వర్తింప చేస్తుంది. అరట్టైలో మాత్రం కేవలం వాయిస్, వీడియో కాల్స్‌కు మాత్రమే ఈ సదుపాయం ఉంది. అయితే, టెక్స్ట్ మెసేజీలకు త్వరలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను వర్తింప చేస్తామని ఇటీవలే అరట్టై మాత్రు సంస్థ జోహో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..

పాత స్మార్ట్ ఫోన్‌ను పారేద్దామని అనుకుంటున్నారా.. పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే..

సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..

Read Latest and Technology News

Updated Date - Sep 30 , 2025 | 09:10 PM