Smart Phone Reuse: పాత స్మార్ట్ ఫోన్‌ను పారేద్దామని అనుకుంటున్నారా.. పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే..
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:07 AM
పాత్ స్మార్ట్ ఫోన్‌లతో పలు ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పారేసే బదులు ఇతర మార్గా్ల్లో వాడుకుంటే ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా హాని తగ్గుతుందని చెబుతున్నారు. మరి పాత ఫోన్‌లను ఎలా మళ్లీ వినియోగించుకోవాలో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: పాత్ స్మార్ట్ ఫోన్‌ను చాలా మంది పారేయడమో లేదా తెలిసిన వారికి ఇవ్వడమో చేస్తుంటారు. అయితే, పాత్ ఫోన్‌లతో కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా వీటిని వాడుకుంటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు (reuse old smartphone).
సీసీటీవీ లేదా సెక్యూరిటీ కెమెరాగా..
పాత స్మార్ట్ ఫోన్‌ను సీసీటీవీ కెమెరా లేదా హోమ్ సెక్యూరిటీ కెమెరాగా వాడుకోవచ్చు. ఇందుకోసం Alfred లేదా manything వంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత వైఫైకి ఫోన్‌ను కనెక్ట్ చేసి ఇల్లు లేదా ఆఫీసుపై రియల్ టైమ్‌లో ఎక్కడి నుంచైనా ఓ కన్నేసి ఉంచొచ్చు (old phone as security camera).
చిన్నారుల కోసం..
పాత స్మార్ట్ ఫోన్‌లను చిన్నారుల ఎంటర్‌టెయిన్‌మెంట్ సాధనాలుగా కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం యూట్యూ్బ్ కిడ్స్, లేదా ఇతర ఎడ్యుకేషనల్, గేమ్స్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను పిల్లల చేతికి ఇవ్వకుండా ఉంటే అది పాడయ్యే అవకాశాలు తగ్గుతాయి (repurpose phone ideas).
స్మార్ట్ హోమ్ కంట్రోలర్‌గా..
స్మార్ట్ హోమ్ కంట్రోలర్‌గా కూడా పాత స్మార్ట్ ఫోన్లను వినియోగించుకోవచ్చు. స్మార్ట్ బల్బులు, ప్లగ్‌లు కెమెరాలు, ఇతర ఐఓటీ డివైజ్‌లను నియంత్రించొచ్చు. ఫలితంగా అధిక ధరలు పెట్టి ప్రత్యేక డివైజ్‌లు కొనాల్సిన బాధ తప్పుతుంది.
మీడియా ప్లేయర్‌గా..
పాత ఫోన్‌లను మ్యూజిక్, స్ట్రీమింగ్ డివైజ్‌గా కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం వీటిల్లో స్పాటిఫై, గానా, జియో సావన్ వంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తరువాత ఫోన్‌ను బ్లూటూత్ స్పీకర్లకు కనెక్ట్ చేసుకుంటే ఎంచక్కా సంగీతాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
వైఫై హాట్ స్పాట్‌గా..
ప్రయాణాలప్పుడు పాత ఫోన్‌లను వైఫై హాట్‌స్పాట్‌గా కూడా వాడుకోవచ్చు. ఈమెయిల్స్ చెక్ చేసుకునేందుకు, డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసుకునేందుకు వినియోగించొచ్చు. ఎమర్జెన్సీ సమయాల్లో లేదా పలు పనులను ఒకేసారి చక్కబెట్టే సమయాల్లో అక్కరకు వచ్చే రెండో డివైజ్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..
విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..
Read Latest and Technology News