Share News

Restarting Phone: వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..

ABN , Publish Date - Sep 30 , 2025 | 07:51 PM

ఫోన్‌ను వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలా చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Restarting Phone: వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..
Restart Phone Weekly

ఇంటర్నెట్ డెస్క్: లాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో ఏదైనా లోపం వచ్చినప్పుడు చాలా మందిని వాటిని రీస్టార్ట్ చేస్తుంటారు. ఇన్‌స్టాలేషన్ సమస్యలప్పుడు కూడా ఇలాగే చేస్తారు. కానీ స్మార్ట్ ఫోన్ విషయంలో మాత్రం ఇలా చేయ్యరు. దీని వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు (restart phone weekly).

తరచూ రీస్టార్ట్ చేయకపోతే వచ్చే సమస్యలు

ఫోన్‌ను తరచూ రీచార్జ్ చేయకపోతే పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ర్యామ్ నిండిపోయి ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ (స్తంభించిపోవడం) అవుతుంది. ఒక్కోసారి అప్‌డేట్స్‌ కూడా సరిగా ఇన్‌స్టాల్ కాక ఫోన్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. నెట్‌వర్క్ సమస్యలు, కాల్ డ్రాప్‌లు వంటివి ఇబ్బంది పెడతాయి (smartphone restart benefits).

ఇక క్రమం తప్పకుండా ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తుంటే మెమరీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. ఫోన్ స్పీడు, బ్యాటరీ లైఫ్ పెరుగుతాయి. సిస్టమ్ స్థిరంగా పనిచేస్తుంది. చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ సమస్యలు కూడా వాటంతట అవే పరిష్కారమవుతాయి. అప్‌డేట్స్ కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ కావడంతో ఫోన్‌ కూడా ఎక్కువగా వేడెక్కదు.


కొన్ని రకాల మాల్‌వేర్‌లు, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్‌లను ఫోన్ రీస్టార్టింగ్‌తో నిలిచిపోతాయి. ఫలితంగా ఫోన్‌పై ఒత్తిడి తగ్గి పనితీరు మెరుగవుతుంది. మెమరీ లీక్స్ కూడా అడ్డుకట్ట పడుతుంది. ర్యామ్‌ను సమర్థవంతంగా ఫోన్‌ వినియోగించగలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ సింకింగ్‌లో సమస్యలు తలెత్తినప్పుడు కూడా రీస్టార్టింగ్ సరైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. తరచూ స్టక్ అయ్యి ఇబ్బంది పెట్టే యాప్‌లకు కూడా ఇది చక్కమని పరిష్కారమని చెబుతున్నారు (phone performance tips).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. ఫోన్ నెమ్మదిస్తున్నా లేదా అప్‌డేట్స్ సరిగా ఇన్‌స్టాల్ కాకపోయినా ఇలాగే చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ వెంటనే ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.


ఇవి కూడా చదవండి

పాత స్మార్ట్ ఫోన్‌ను పారేద్దామని అనుకుంటున్నారా.. పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే..

సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..

Read Latest and Technology News

Updated Date - Sep 30 , 2025 | 07:51 PM