ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ENG vs IND Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందా?

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:50 AM

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా దీటుగానే బదులిస్తోంది.

ENG vs IND First Match

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది (ENG vs IND). తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా దీటుగానే బదులిస్తోంది. అయితే హెడ్లింగ్లే‌లో వాతావరణం ఇరు జట్లను భయపెడుతోంది (Headingley Weather Report).

తొలి టెస్ట్ రెండో రోజైన శనివారం హెడ్లింగ్లేలో వర్షం కురిసింది. దీంతో గంటసేపు ఆటను నిలిపివేశారు. మూడో రోజైన ఆదివారం కూడా మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హెడ్లింగ్లేలో శనివారం కంటే ఎక్కువగానే వర్షం కురిసే అవకాశాలు 65 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం ఉందట. అయితే ఒకవేళ వర్షం కురిసినా రెండు గంటలకు మించి ఉండకపోవచ్చని వాతావరణ శాఖ సమాచారం.

ఒకవైపు బుమ్రా పదునైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నా మరో ఎండ్‌లో ప్రిసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. దీనికి తోడు ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. దీంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 209/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కాగా, ఇంగ్లండ్ ఆశలన్నీ ఓలీ పోప్‌ (100 బ్యాటింగ్‌) పైనే ఉన్నాయి. శనివారమే సెంచరీ సాధించిన పోప్ ఆదివారం కూడా తన ఫామ్ కొనసాగించి పరుగులు చేస్తాడని మేనేజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది.

ఇవీ చదవండి:

పట్టువదలొద్దు.. టీమిండియాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు: సౌరవ్ గంగూలీ

విరాట్ కోహ్లీకి రీప్లేస్‌మెంట్ అంత సులభంగా జరగదు: సౌరవ్ గంగూలీ

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 11:50 AM