ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

China Open 2025: సింధుకు ఉన్నతి షాక్‌

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:06 AM

యువ షట్లర్‌ ఉన్నతి హుడా పెను సంచలనం సృష్టించింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధును చిత్తు చేయడం ద్వారా తన కెరీర్‌లో అతి పెద్ద విజయం సాధించింది...

  • క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశం

  • సాత్విక్‌జోడీ సైతం

చాంగ్జౌ: యువ షట్లర్‌ ఉన్నతి హుడా పెను సంచలనం సృష్టించింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధును చిత్తు చేయడం ద్వారా తన కెరీర్‌లో అతి పెద్ద విజయం సాధించింది. చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఇందుకు వేదికైంది. ఇక..సాత్విక్‌ జోడీ కూడా క్వార్టర్‌ఫైనల్‌ చేరగా, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ ఫైనల్లో 17 ఏళ్ల ఉన్నతి ఒక గేమ్‌ కోల్పోయినా వదలకుండా పోరాడి 21-16, 19-21, 21-13తో సింధును ఇంటిదారి పట్టించింది. ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో సహచర భారత క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం ఏడేళ్లలో సింధుకిదే తొలిసారి. హుడా క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌కు చెందిన మూడో సీడ్‌ అకానె యమగూచిని ఢీకొంటుంది. పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి 21-19, 21-19తో ఎనిమిదో సీడ్‌ ఇండోనేసియా జంట లియో రోలీ/బగాస్‌ మౌలానాపై గెలుపొంది రౌండ్‌ -8కి చేరింది. సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 21-18, 15-21, 8-21 ఆరో సీడ్‌ చౌ టీన్‌ చెన్‌ (తైపీ) చేతిలో పోరాడి ఓడాడు.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 02:06 AM