ఉమామహేష్‌కు రజతం
ABN, Publish Date - May 04 , 2025 | 02:45 AM
జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో విజయవాడ షూటర్ మద్దినేని ఉమామహేష్ రజతం దక్కించుకున్నాడు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో 10 మీటర్ల రైఫిల్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో విజయవాడ షూటర్ మద్దినేని ఉమామహేష్ రజతం దక్కించుకున్నాడు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో 10 మీటర్ల రైఫిల్ జూనియర్ విభాగంలో మహేష్ 251 స్కోరుతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. కేవలం 0.1 పాయింట్ తేడాతో త్రుటిలో స్వర్ణ పతకాన్ని మహేష్ కోల్పోయాడు. పార్థ్ రాకేష్ (మహారాష్ట్ర) 251.01 స్కోరుతో స్వర్ణం, ప్రణవ్ (కర్ణాటక) 229.5 స్కోరుతో కాంస్యం గెలిచారు. ఈ పోటీల్లో ఆంధ్రకు ఇది రెండో పతకం. తొలి రోజు పోటీల్లో ముఖేష్ స్వర్ణం సాధించడం తెలిసిందే. కాగా కిరణ్ అంకుష్ జాదవ్ 10మీ. ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. వివేక్ శర్మ (250.1) రజతం, విశాల్ సింగ్ (230.1) కాంస్యం అందుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 02:46 AM