ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UAE Rejects PCBs Request: పాక్ క్రికెట్ బోర్డుకు షాక్.. పీఎస్‌ఎల్ టోర్నీకి నో చెప్పేందుకు రెడీ అయిన యూఏఈ

ABN, Publish Date - May 09 , 2025 | 08:16 PM

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పీఎస్‌ఎల్ టోర్నీని యూఏఈలో నిర్వహించుకుంటామన్న పాక్ బోర్డు అభ్యర్థనను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తిరస్కరించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

UAE Rejects PCBs Request

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత మిసైల్ దాడులతో అక్కడి పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా నిలిచిపోయింది. అయితే, మిగతా మ్యాచ్‌లు యఏఈలో నిర్వహించాలనుకున్న ప్లాన్ వర్కవుటయ్యేలా కనిపించట్లేదు. యూఏఈలో మ్యాచులు నిర్వహించుకునేందుకు పాక్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, మిగిలిన పీఎస్‌ఎల్ మ్యాచులు యూఏఈలో జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ భద్రతాపరమైన అంశాలకు సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎస్ఎల్ మ్యాచులకు అనుమతిస్తే ఎమిరేట్స్ బోర్డును పీసీబీకి మిత్రుడిగా భావించే అవకాశం ఉందన్న అంచనాకు అక్కడి వారు వచ్చినట్టు సమాచారం.


ఇటీవల కాలంలో బీసీసీఐ, ఎమిరేట్స్ బోర్డు మధ్య బంధాలు బలోపేతమయ్యాయి. ఇప్పటికే యూఏఈలో 2021 నాటి టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఇటీవలి ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా జరిగింది. ఇక ఐసీసీ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఐసీసీకి బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా నేతృత్వం వహిస్తున్నారు.

‘‘యూఏఈలో దక్షిణాసియాకు చెందిన అనేక వర్గాలు ఉంటున్నాయి. ఇవన్నీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తాయి. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ లాంటి టోర్నీకి ఆతిథ్యమిస్తే శాంతియుత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది. వర్గాల మధ్య విభేదాలు, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.


పీఎస్ఎల్‌ టోర్నీలో ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇవన్నీ రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లోని స్టేడియాల్లో జరగాల్సి ఉంది. అయితే, ఇవన్నీ యూఏఈలో జరుగుతాయని పీసీబీ ఈ ఉదయమే ప్రకటించింది. మ్యాచ్‌ల తుది షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వేదిక మార్పు కుదిరే పని కాదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పహల్గాం బాధితులకు న్యాయం కోసం భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని క్రీడ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 09:03 PM