ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: పాక్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్.. మమ్మల్ని హోటల్ బయటకు వెళ్లనివ్వలేదు: రోహిత్

ABN, Publish Date - Jun 28 , 2025 | 10:47 AM

గతేడాది అమెరికా-వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ మెగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.

TeamIndia

గతేడాది అమెరికా-వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ (T-20 World cup 2024) మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ మెగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ (Ind vs Pak) ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌కు ముందు జరిగిన ఆసక్తికర సంఘటన గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా వెల్లడించాడు.

'భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు మాకు ఓ షాకింగ్ విషయం చెప్పారు. భారత జట్టుకు ముప్పు ఉందని చెప్పారు. మ్యాచ్‌కు ముందు హోటల్ నుంచి మమ్మల్ని అడుగు బయటపెట్టనివ్వలేదు. హోటల్ గదుల్లోనే ఉంటూ ఆహారం తీసుకున్నాం. ఏదో జరుగుతోందని అర్థమైంది. మ్యాచ్ రోజు హోటల్ మొత్తం అభిమానులు, మీడియా ప్రతినిధులతో నిండిపోయింది. మాకు కనీసం నడిచే అవకాశం కూడా లేదు' అని రోహిత్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

'ఆ రోజు హోటల్ నుంచి స్టేడియంకు వచ్చే సమయానికి అంతా మారిపోయింది. స్టేడియం దగ్గర భారత్, పాక్ అభిమానులు కేరంతలు, నృత్యాలతో సందడి చేశారు. స్టేడియం దగ్గర పండగ వాతావరణం కనిపించింది. అప్పటి వరకు ఉన్న ఒత్తిడి అంతా మాయమై ఉత్సాహం వచ్చింది. పాకిస్థాన్‌తో నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ఎప్పుడు ఆడినా అలాంటి ఉత్సాహం మాత్రం అద్భుతంగా ఉంటుంద'ని రోహిత్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 113 పరుగులు మాత్రమే చేసి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇవీ చదవండి:

ప్రేయసితో రూమ్‌కు ధవన్.. రోహిత్ ఏమన్నాడంటే..

బుమ్రా లేకుండానే బరిలోకి..

టీమిండియా తిరుగులేని స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 01:09 PM