Asian Boxing Championship 2025: సెమీఫైనల్లో ఆరుగురు భారత బాక్సర్లు
ABN, Publish Date - Apr 24 , 2025 | 04:02 AM
ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రగతిశీల ఫలితాలు. ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్ దాకా దూసుకెళ్లారు.
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్-15, అండర్-17 చాంపియన్‌షిప్స్‌లో జోరు కనబరుస్తూ ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన 46 కిలోల అండర్-15 క్వార్టర్‌ఫైనల్లో రుద్రాక్ష్ సింగ్ 3-0తో ఐదర్ ముసేవ్ (కజకిస్థాన్)ను చిత్తు చేశాడు. ఈ విభాగం ఇతర క్వార్టర్‌ఫైనల్స్‌లో సంస్కార్ (36కి.)-అల్మత్‌బౌలీపై, 37 కి.లలో హర్సిల్-మహ్మదలీపై, 40 కి.లలో బల్హారా-నూర్‌సలేమ్‌పై, 49కి.లలో సంచిత్-యూ చెన్‌పై నెగ్గారు. మహిళల 43 కిలోల అండర్-15 విభాగంలో మిల్కీ 5-0తో కజక్ బాక్సర్ యెల్దానాను ఓడించి సెమీ్‌స చేరింది.
Updated Date - Apr 24 , 2025 | 04:06 AM