Dinesh Karthik: టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్
ABN, Publish Date - Jun 17 , 2025 | 10:43 PM
టీమిండియాకు కెప్టెన్సీ వహించడం చాలా పెద్ద బాధ్యత అని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. గిల్ భారీ సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు కెప్టెన్సీ వహించడం ఎంత పెద్ద బాధ్యతో శుభ్‌మన్ గిల్ ఇంకా అర్థం చేసుకోలేదని మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించారు. అతడు దిగే బ్యాటింగ్ పొజిషన్‌కు ఎంతో ప్రాధాన్యత కూడా ఉందని అన్నారు. రాబోయే సవాళ్లపై కూడా గిల్‌కు అంత అవగాహన లేదని అన్నారు. ఇంగ్లండ్‌లో గతంలో పర్యటించిన అనేక జట్లు అక్కడి గేమ్ ఎంత క్లిష్ఠమో స్వానుభవంతో తెలుసుకున్నాయని అన్నాడు.
‘కెప్టెన్సీ బాధ్యత ఎంత పెద్దదో గిల్‌కు అర్థమైందని నేను అనుకోవడం లేదు. సింహం బోనులోకి అతడు కాలుపెడుతున్నాడు. ఇక ఇంగ్లండ్ జట్టుతో దాని సొంత గడ్డపై తలపడటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సూపర్ స్టార్లు ఉన్న ఎన్నో జట్లు ఈ విషయాన్ని స్వానుభవంతో తెలుసుకున్నాయి’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో దినేశ్ వ్యాఖ్యానించాడు.
ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా ఉండటం భారత్‌కు కాస్త కలిసొచ్చే అంశమని దినేశ్ కార్తిక్ అన్నాడు. భారత్ వ్యూహంలో పడి వాళ్లు చిత్తయ్యే అవకాశం కూడా లేకపోలేదని అన్నాడు.
‘గిల్ అదృష్టం కొద్దీ ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇదొక్కటే నా దృష్టిలో టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఫలితంగా ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్‌పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. బౌలింగ్ విషయంలో ఇంగ్లండ్ ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. చివరకు ఇదే టీమిండియాకు అనుకూలంగా మారొచ్చు’ అని దినేశ్ అన్నాడు.
ఇక ఇంగ్లండ్ జట్టు సభ్యులను గాయాలు కూడా వేధిస్తున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ తొలి మూడు టెస్టులకు దూరమయ్యాడు. జొఫ్రా ఆర్చర్ కూడా తొలి టెస్టుకి అందుబాటులో ఉండడు. గస్ అట్కిన్సన్ హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెయిన్ నుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బౌలర్లు భారత యువ బ్యాటర్లను ఎలా ఎదుర్కొంటారో అన్న ఉత్కంఠ ఇరు దేశాల అభిమానుల్లో నెలకొంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంతటి భారీ టోర్నీలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గిల్‌కు ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 17 , 2025 | 11:30 PM