Jasprit Bumrah: బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
ABN , Publish Date - Jun 15 , 2025 | 07:19 PM
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశారు. బుమ్రాను ఒక రోజులో 13 ఓవర్లకు మించి బౌలింగ్ చేయించొద్దని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్, రోహిత్ లేకుండానే భారత్ తలపడనుంది. ఈ టోర్నీకి ఫాస్ట్ బౌలర్లు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కీలక సూచన చేశారు. ఈ టోర్నీలో విజయానికి కీలకమైన ఫాస్ట్ బౌలర్ విషయంలో పలు సూచనలు చేశారు.
‘బుమ్రా విషయంలో పక్కా ప్లాన్ ఉండాలి. అతడితో రోజుకు 12 నుంచి 13 ఓవర్లకు మించి బౌలింగ్ చేయించకూడదు. అతడిని వికెట్ టేకర్‌గా వినియోగించడంపైనే దృష్టిపెట్టాలి. గిల్‌కు ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. నా అభిప్రాయం ప్రకారం ఈ టోర్నీకి నలుగురు ఫాస్ట్ బౌలర్లు అవసరం. ఈ సమయంలో సిరాజ్, అర్షదీప్ వంటి వారు రంగంలోకి దిగాలి. నితీశ్, శార్దూల్ విషయంలో నాకింకా స్పష్టత లేదు. వాళ్లు బ్యాటింగ్‌లోనూ రాణించొచ్చు. ఏడుగురు బ్యాటర్లు, స్పెషలిస్టు బౌలర్లతో భారత్ రంగంలోకి దిగాలని నా అభిప్రాయం’ అని గంగూలీ అన్నారు.
ఈ టెస్టు సిరీస్‌లో బుమ్రాను పరిమిత స్థాయిలో వినియోగిస్తామని టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. బుమ్రాను వరుస టెస్టుల్లో ఆడనివ్వబోమని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ సందర్భంగా బుమ్రాకు జనవరిలో వీపు గాయమైన విషయం తెలిసిందే. దీంతో, అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావాల్సి వచ్చింది. ఇక తాజా ఐపీఎల్‌లో బుమ్రా ముంబై తరఫున బరిలోకి దిగాడు.
ఇక ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియాలో శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితిష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్
స్వదేశానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. కారణం ఏంటంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి