కెప్టెన్‌గా గిల్ ఖాయమేనా
ABN, Publish Date - May 18 , 2025 | 02:33 AM
రోహిత్ శర్మ రిటైర్ కావడంతో భారత టెస్టు జట్టు నూతన కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ అందరికంటే...
గంభీర్, అగార్కర్‌తో సమావేశాలు
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ రిటైర్ కావడంతో భారత టెస్టు జట్టు నూతన కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ అందరికంటే ముందున్నాడు. జూన్ 20 నుంచి సాగే ఇంగ్లండ్ పర్యటన కోసం అతడికే పగ్గాలు అప్పగిస్తారనే కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల గిల్‌ను జట్టు ప్రధాన కోచ్ గంభీర్ తన నివాసానికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా ఐదు గంటలపాటు ఇదే విషయమై చర్చ సాగినట్టు సమాచారం. దీంతో భవిష్యత్ కెప్టెన్‌గా గిల్‌ను ప్రకటించడం ఖాయమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఈనెల 6న ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తోనూ గిల్ సమావేశమయ్యాడట. భారత్ క్రికెట్‌లో ఈ ఇద్దరి ముఖ్యులతో అతడి భేటీ కారణంగా బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. బుమ్రా, పంత్, రాహుల్ పోటీలో ఉన్నా సెలెక్టర్లు కూడా గిల్‌కే మద్దతిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే సీనియర్లను తోసిరాజని గిల్‌కు అనూహ్యంగా పరపతి పెరగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బోర్డులోని ముఖ్యలు కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇంత త్వరగా అతడికి టెస్టు బాధ్యతలు అప్పగించడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుమ్రా, జడేజాలలో ఒకరికి కెప్టెన్సీ ఇచ్చి గిల్‌ను డిప్యూటీగా చేస్తే బాగుంటుందని మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 02:33 AM