ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Singapore Open Badminton 2025: సెమీస్‌లో సాత్విక్‌ జంటకు షాక్‌

ABN, Publish Date - Jun 01 , 2025 | 01:34 AM

సింగపూర్ ఓపెన్ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జంట మలేసియా జోడీ చేతిలో పోరాడి ఓటమిపాలైంది. నిర్ణాయక గేమ్‌లో చివర్లో పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయారు.

  • సింగపూర్‌ ఓపెన్‌

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీ్‌సలో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-19, 10-21, 18-21తో మలేసియాకు చెందిన ఆరన్‌ చియా-సో వు యిక్‌ చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో సాత్విక్‌ జోడీ నెగ్గినా.. ఆ తర్వాతి గేమ్‌లో ధాటిగా ఆడిన ప్రత్యర్థి ద్వయం ఆ గేమ్‌ను గెలిచి స్కోరు సమం చేసింది. నిర్ణాయక ఆఖరి గేమ్‌లో 11-20తో వెనుకంజలో ఉన్నప్పుడు వరుసగా ఏడు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొన్న సాత్విక్‌ జంట సమం చేసేందుకు తీవ్రంగా పోరాడింది. కానీ, ఉత్కంఠ మధ్య ఆఖరి పాయింట్‌ సాధించిన మలేసియా జంట గేమ్‌తోపాటు మ్యాచ్‌ను నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Updated Date - Jun 01 , 2025 | 01:39 AM