ఆడని వాళ్లు నిధులు వెనక్కివ్వండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:01 AM
సహేతుకమైన కారణాలు లేకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించకుండా తప్పుకుంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) షాకిచ్చింది...
సాయ్ ఆదేశం
న్యూఢిల్లీ: సహేతుకమైన కారణాలు లేకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించకుండా తప్పుకుంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) షాకిచ్చింది. కేంద్ర క్రీడా శాఖ అమలు చేసే వివిధ పథకాల కింద వారికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలని జాతీయ టెన్నిస్ సంఘాన్ని సాయ్ ఆదేశించింది. ‘తీసుకున్న నిధులకు క్రీడాకారులు జవాబుదారీగా ఉండాలి.. దేశం తరఫున ఆడేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల’ని సాయ్ పేర్కొంది. టాప్స్‌తో పాటు కొత్తగా టీఏజీజీ (టార్గెట్ ఆసియా గేమ్స్ గ్రూప్)ను సాయ్ ఏర్పాటు చేసింది. భారత టెన్నిస్ ప్లేయర్లలో యుకీ భాంబ్రీ, శశికుమార్ ముకుంద్, సుమిత్ నగల్ గత ఏడాది నుంచి పలు అంతర్జాతీయ టోర్నీల నుంచి వైదొలగడం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 20 , 2025 | 05:01 AM