Wimbledon: క్వార్టర్స్‌లో సబలెంక
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:11 AM
టాప్ సీడ్ అర్యానా సబలెంక వింబుల్డన్ టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. ఈ బెలారస్ భామ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్, 17వ సీడ్ ఖచనోవ్ కూడా...
వింబుల్డన్
లండన్: టాప్ సీడ్ అర్యానా సబలెంక వింబుల్డన్ టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. ఈ బెలారస్ భామ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్, 17వ సీడ్ ఖచనోవ్ కూడా రౌండ్-8కి చేరారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైన్లో ప్రపంచ నెంబర్ వన్ సబలెంక 6-4, 7-6 (4)తో 24వ సీడ్ మెర్టెన్స్‌పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో లారా సిగ్మండ్ 6-3, 6-2తో సీరాపై, పల్యుచెన్కోవా 7-6 (3), 6-4తో సోనె కర్తాల్‌పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో ఫ్రిట్జ్ 6-1, 3-0తో జోర్డాన్‌పై ఆధిక్యంలో ఉన్నప్పుడు గాయంతో ప్రత్యర్థి వైదొలిగాడు. దాంతో ఫ్రిట్జ్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. 17వ సీడ్ ఖచనోవ్ 6-4, 6-2, 6-3తో మచ్‌జక్‌ని ఓడించాడు.
ఇవీ చదవండి:
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్
టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 07 , 2025 | 02:12 AM